ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి | Road Accident In Srikakulam | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Mar 15 2020 7:34 AM | Updated on Mar 15 2020 8:14 AM

Road Accident In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం :  జిల్లాలోని గార మండలం బైరి జంక్షన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, బైక్‌ ఢీకొని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను జిల్లాలోని సరుబుజ్జిలి మండలం కొత్తకోట వాసులుగా గుర్తించారు. నరసన్నపేటలో జరిగిన తమ బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరిగి వస్తుండగా బైరికూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తండ్రీకొడుకులైన వెంకటి, సింహాచలంతోపాటు శ్రీలత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, గణేశ్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement