మద్యం మత్తులో యువకులను ఢీకొట్టిన యువతులు

Road Accident in Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మద్యం మత్తులో యువతులు హద్దులు మీరుతున్నారు. ముగ్గురు యువతులు తప్ప తాగి శనివారం అర్థరాత్రి ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్లారు. ఆ సమయంలో రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలోని బయోడైవర్సిటీ వద్ద అటుగా వస్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టారు. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి స్థానికి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సీఏ చదువుతున్న జెన్నీ జాకబ్‌ మద్యం సేవించి వాహనం నడిపిందని తెలిసింది. చనిపోయిన వ్యక్తిని చిరంజీవి(20)గా, చికిత్స పొందుతున్న వ్యక్తి సాయి కుమార్‌(22)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top