ఇంజక్షన్‌ వికటించి వైద్యుడు మృతి | RMP Doctor Died Of Injection In Adilabad | Sakshi
Sakshi News home page

ఇంజక్షన్‌ వికటించి వైద్యుడు మృతి

Aug 31 2019 11:12 AM | Updated on Aug 31 2019 11:12 AM

RMP Doctor Died Of Injection In Adilabad - Sakshi

బొడిగె రవికిరణ్‌ మృతదేహం 

సాక్షి, చెన్నూర్‌(ఆదిలాబాద్‌) : మండల కేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు బొడిగె రవికిరణ్‌ (48)శుక్రవారం ఇంజక్షన్‌ వికటించి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌ కుమార్‌ తెలిపారు. వివరాలు రవికిరణ్‌ ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడని కొద్ది కాలంగా పెరాలసిస్‌ వ్యాధితో బాధ పడుతున్నాడని ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో పెరాలసిస్‌కు సంబంధించిన ఇంజక్షన్‌ తీసుకోవడంతో కింద పడిపోయాడని ఎస్సై తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడని తెలిపారు. మృతుడి కుమారుడు కృష్ణచైతన్య పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌ మార్డమ్‌ నిమిత్తం చెన్నూరు తరలించినట్లు ఎస్సై తెలిపారు. రవికిరణ్‌ సొంతగా ఇంజక్షన్‌ తీసుకున్నాడా లేకా ఎవరైన ఇచ్చారా అనేది విచారణలో తెలుసుకుంటామన్నారు. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన రవికిరణ్‌ గత 20 ఏళ్ల నుంచి భీమారంలో ఆర్‌ఎంపీ వైద్యుడుగా సేవలు అందిస్తున్నారు. కాగా రవి కిరణ్‌కు భార్య తోపాటు కూతురు, కుమారుడు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement