రేషన్‌బియ్యం పట్టివేత   | ration rice Captured by police | Sakshi
Sakshi News home page

రేషన్‌బియ్యం పట్టివేత  

Mar 27 2018 11:22 AM | Updated on Aug 21 2018 6:12 PM

ration rice Captured by police - Sakshi

పట్టుకున్న రేషన్‌ బియ్యంతో విజిలెన్స్‌ అధికారులు

జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరుకు చెందిన వానరాతి ప్రభాకర్‌ వద్ద 126.60క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్‌ అధికారులు దాడి చేశారు. అతనిపై 6ఏ కేసుతోపాటు కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం పట్టుకున్న రేషన్‌బియ్యాన్ని మల్యాల సివిల్‌సప్లయ్‌  గోదాంకు తరలించారు. ఈ దాడుల్లో జగిత్యాల ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement