లైంగిక దాడి బాధితురాలిపై యాసిడ్‌ దాడి | Rape Victim Attacked With Acid By Four In Muzaffarnagar | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి బాధితురాలిపై యాసిడ్‌ దాడి

Dec 8 2019 4:03 PM | Updated on Dec 10 2019 12:17 PM

Rape Victim Attacked With Acid By Four In Muzaffarnagar - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

నిర్భయ, దిశ..ఇలా ఎన్నో ఘటనలపై ప్రజాగ్రహం పెల్లుబికినా మహిళలపై నేరాలు తగ్గడం లేదు..

లక్నో : లైంగిక దాడి బాధితురాలిపై నలుగురు వ్యక్తులు యాసిడ్‌ దాడికి పాల్పడిన ఘటన యూపీలోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. తమపై పోలీసులకు ఇచ్చిన లైంగిక దాడి ఫిర్యాదును వెనక్కితీసుకునేందుకు మహిళ (30) తిరస్కరించడంతో ఆమెపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. 30 శాతం కాలిన గాయాలతో బాధితురాలు మీరట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు మహిళ నిరాకరించడంతో బుధవారం రాత్రి ఆమె ఇంట్లోకి చొచ్చుకువెళ్లిన నలుగురు వ్యక్తులు ఆమెపై యాసిడ్‌ పోశారు. నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని షాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ గిరిజాశంకర్‌ త్రిపాఠి వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు స్ధానిక కోర్టులో కేసు వేశారని దీనిపై రెచ్చిపోయిన నిందితులు ఆమెపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement