ఏడేళ్ల దళిత బాలికపై అత్యాచారం | rape attempt on 7 years old dalit girl | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల దళిత బాలికపై అత్యాచారం

Mar 1 2018 8:27 AM | Updated on Jul 28 2018 8:53 PM

rape attempt on 7 years old dalit girl - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌(చెన్నూర్‌): మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ముదిగుంట గ్రామంలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 40 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అత్యచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 19న గ్రామంలో నూతనంగా నిర్మించిన హన్‌మాన్‌ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న సదరు వ్యక్తి బాలి కను బలవంతంగా సమీపంలోని గుడిసెలోకి తీసుకెళ్లి అకృత్యానికి పాల్పడ్డట్టు సమాచారం.

బాలిక కొద్దిసేపటి తర్వాత ఏడ్చుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. నిందితుడు గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధికి దగ్గరి బంధువు కావడంతో ఈ విషయం ఎక్కడా చెప్పవద్దని బాలిక తల్లిదండ్రులను బెదిరించినట్లు సమాచారం. గుట్టుచప్పు డు కాకుండా బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించి నట్లు తెలిసింది. జైపూర్‌ ఎస్సై ఆంజనేయులును వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి రాలేదని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. దీంతో ఏసీపీ సీతారాములు దృష్టికి సాక్షి తీసుకువెళ్లగా.. వెంటనే గ్రామానికి పోలీసులను విచారణ చేపడుతామని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement