రాజస్తాన్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారాలు

rajasthan in three girls molestation - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఇందులో ఆళ్వార్‌ జిల్లా కూడా ఉంది. ఇటీవల ఈ జిల్లాలోనే దళిత మహిళపై గ్యాంగ్‌ రేప్‌ ఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆళ్వార్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(15) ఈ నెల 14వ తేదీన బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి వెళ్లగా ముగ్గురు బాలురు ఆమెను అపహరించి, గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డారు. ఇది తెలిసిన బాధితురాలి బంధువులు నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారిలో ఒకరు మరుసటి రోజు రోడ్డు పక్క శవమై కనిపించాడు.

మిగతా ఇద్దరినీ కోర్టు ఆదేశాల మేరకు జువెనైల్‌ హోంకు తరలించినట్లు ఎస్పీ అనిల్‌ తెలిపారు. ఈ నెల 17న చురు ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై బంధువైన 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈనెల 16న ధోల్‌పూర్‌లో బాలిక(8)పై యువకుడు(18) అత్యాచారం చేశాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, ఏప్రిల్‌ 26వ తేదీన ఆళ్వార్‌లో దళిత మహిళపై గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిపైనా పోలీసులు ఎస్‌సీ/ఎస్‌టీ అట్రాసిటీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులపై బీజేపీ మండిపడింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top