రైల్వే ఉద్యోగి రాహుల్‌ బలవన్మరణం | Railway Employee Commits End Lives in Hyderabad | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగి బలవన్మరణం

Mar 10 2020 8:56 AM | Updated on Mar 10 2020 8:56 AM

Railway Employee Commits End Lives in Hyderabad - Sakshi

రాహుల్‌యాదవ్‌(ఫైల్‌)

నేరేడ్‌మెట్‌: రైల్వే ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహస్వామి తెలిపిన మేరకు..ఓల్డ్‌ నేరేడ్‌మెట్‌కు చెందిన ఎస్‌.     రాహుల్‌యాదవ్‌(27) లాలాగూడలోని రైల్వే వర్క్‌షాపులో పని చేస్తున్నాడు. ఈనెల 6న భార్యతో కలిసి రాహుల్‌ చెంగిచెర్లలోని అత్తారింటికి వెళ్లి, శనివారం వరకు అక్కేడే ఉన్నాడు. ఆదివారం రాత్రి  ఓల్డ్‌నేరేడ్‌మెట్‌లోని సొంతింటికి వచ్చాడు.  రాత్రి  భార్య  ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఆమె వెంటనే ఓల్డ్‌నేరేడ్‌మెట్‌లో ఉంటున్న రాహుల్‌ బాబాయ్‌ కిషన్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. ఆయన వచ్చి పిలిచినా స్పందించకపోవడంతో  స్థానికులతో కలిసి తలుపులు పగులకొట్టి చూడగా గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని రాహుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement