కుందేలు వేటగాళ్ల అరెస్టు  | Rabbit hunters arrested | Sakshi
Sakshi News home page

కుందేలు వేటగాళ్ల అరెస్టు 

Apr 6 2018 12:25 PM | Updated on Aug 25 2018 6:21 PM

Rabbit hunters arrested - Sakshi

పట్టుబడ్డ నిందితులు

ఎల్లారెడ్డి: కుందేలును వేటాడినవారిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి అటవీశాఖ రేంజ్‌ అధికారి రాధాకిషన్‌ గురువారం తెలిపారు. మండలంలోని దేవునిపల్లి గ్రామ శివారులో కుందేళ్లను వేటాడుతూ, వేటగాళ్లు పట్టుబడినట్లు ఆయన తెలిపారు.

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన మండిరాం, భీమా అనే ఇద్దరు యువకులు కుందేళ్లతో పట్టుబడినట్లు ఆయన తెలిపారు. అటవీశాఖ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రేంజ్‌ అధికారి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement