ప్రియుడితో పారిపోయేందుకు మహిళ ఘాతుకం..

Punjab Boy Dies After Mother Stuffs Him In Bed Box - Sakshi

చండీగఢ్: ప్రియుడితో పారిపోయేందుకు మహిళ తన రెండున్నరేళ్ల చిన్నారిని పరుపు కింద కుక్కడంతో ఊపిరాడక బాబు మరణించిన ఘటన పంజాబ్‌లోని బురాలి గ్రామంలో వెలుగుచూసింది. ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్న దశరథ్‌ పనులు ముగించుకుని ఇంటికి రాగా, భార్య కుమారుడు కనిపించకపోవడంతో వారు అత్తవారింటికి వెళ్లి ఉంటారని భావించాడు. భార్యకు ఫోన్‌ చేయగా తాను ఇంట్లో లేనని, బాలుడిని పరుపు కింద పడుకోబెట్టానని చెప్పడంతో దశరథ్‌ పరుపు కింద చూడటంతో రెండున్నరేళ్ల చిన్నారి విగతజీవిగా కనిపించాడు. కొడుకును హత్య చేసి తన భార్య ప్రియుడితో పారిపోయిందని దశరథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top