బంజారాహిల్స్‌ : స్పా ముసుగులో వ్యభిచారం | Prostitution Scandal In Spa Centre banjara hills hyderabad | Sakshi
Sakshi News home page

స్పా ముసుగులో వ్యభిచారం

Oct 5 2018 10:15 AM | Updated on Oct 8 2018 12:53 PM

Prostitution Scandal In Spa Centre banjara hills hyderabad - Sakshi

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో స్టూడియో మేకర్స్‌ స్పా పేరుతో

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో స్టూడియో మేకర్స్‌ స్పా పేరుతో ఏర్పాటు చేసిన మసాజ్‌ సెంటర్‌లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. సెంటర్‌ నిర్వాహకుడు, ప్రధాన నిందితుడు సతీష్‌ అలియాస్‌ శరణప్ప అలియాస్‌ హరినాథ్‌ పరారీలో ఉండగా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

రోడ్‌ నెం. 12లో హైలైన్‌ కాంప్లెక్స్‌ రెండో అంతస్తులో ఫ్లాట్‌ నంబర్‌ 205లో స్టూడియో మేకర్స్‌ స్పా పేరుతో కొనసాగుతున్న ప్లాట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ గట్టు మల్లు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో మసాజ్‌కు సంబంధించిన ఎలాంటి పరికరాలు లేకపోగా గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. రెడ్‌హ్యాండెడ్‌గా విటులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు కే.ఎం.సంతోష్, హేమంత్, చైతన్య, గణేష్, మణికంఠన్‌ తదితరులను అరెస్ట్‌ చేశారు. నలుగురు యువతులను పునరావాస కేంద్రా నికి తరలించారు. వీరి నుంచి నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement