గుండెపోటుతో రిమాండ్‌ ఖైదీ మృతి | prisoner death in jail with heart stroke | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో రిమాండ్‌ ఖైదీ మృతి

Jan 8 2018 12:29 PM | Updated on Jan 8 2018 12:29 PM

నెల్లూరు(క్రైమ్‌): గుండెపోటుకు గురై జీజిహెచ్‌లో చికిత్స పొందుతూ రిమాండ్‌ ఖైదీ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. పోలీసుల సమాచారం మేరకు.. రాపూరు మండలం గండురుపల్లికి చెందిన ఎం. శ్రీహరి (40) గూడూరురూరల్, కలువాయి పోలీసుస్టేషన్ల పరిధిలో మోటార్ల దొంగతనాల కేసుల్లో నిందితుడు. ఈ కేసుల్లో గతేడాది నవంబర్‌ 7వ తేదీ నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో రిమాం డ్‌ అనుభవిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం శ్రీహరికి విపరీతమైన కడుపునొప్పి, గుండెనొప్పి వచ్చింది. దీంతో జైలు అధికారులు అతన్ని చికిత్స నిమి త్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి (జీజీహెచ్‌)కి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. జైలర్‌ ఎ.కాంతరాజు రిమాండ్‌ ఖైదీ మృతి ఘటనపై ఐదోనగర పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఎస్సై సీహెచ్‌ కొండయ్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించి, బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జీజీహెచ్‌లో ఆదివారం మృతదేహానికి ఆర్డీఓ హరిత సమక్షంలో శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement