పెట్రోల్‌ బంకు సొత్తుతో జీవిత ఖైదీ పరార్‌ | Prisioner escapes with money in Petroleum company | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకు సొత్తుతో జీవిత ఖైదీ పరార్‌

Jan 10 2018 5:53 PM | Updated on Aug 29 2018 4:18 PM

Prisioner escapes with money in Petroleum company - Sakshi

నల్గొండ: పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ పరారయ్యాడు. జిల్లా జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పెట్రోల్‌ బంకులో ప్రకాశంజిల్లా యద్దనపూడి మండలం చిమ్మటవారి పాలేనికి చెంది జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉన్న శివకృష్ణ పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి బంకులో డ్యూటీ చేసి బంకుకు వచ్చిన ఆదాయం రూ.25,000 తీసుకుని పరారయ్యాడు. ఇతని కోసం జైలు అధికారులు, స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement