బొటానికల్‌ గార్డెన్‌ హత్యకేసును ఛేదించిన పోలీసులు | police traced mystery behind botanical garden murder | Sakshi
Sakshi News home page

బొటానికల్‌ గార్డెన్‌ హత్యకేసును ఛేదించిన పోలీసులు

Feb 11 2018 2:36 PM | Updated on Aug 21 2018 6:02 PM

police traced mystery behind botanical garden murder - Sakshi

అనుమానితుడు విజయ్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : కొండాపూర్‌లో సంచలనం కలిగించిన గర్భిణీ హత్యకేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నాగ్‌పూర్‌కు చెందిన విజయ్‌కుమార్‌ భార్య ఉండగానే మహారాష్ట్రకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో వివాహం చేసుకోవాలంటూ వత్తిడి తెచ్చింది.

దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలి చూసిన విజయ్‌కుమార్‌ పధకం ప్రకారం ఆమెను హతమార్చాడు. గత నెల 28న ఆమెను హత్య చేసి చిన్న చిన్న ముక్కలుగా నరికి, గోనె సంచిలో కుక్కి, బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. హత్య చేసిన రెండు రోజులకే విజయ్ హైదరాబాద్‌ విడిచి పారిపోయాడు. మరో వ్యక్తి ఈ హత్యకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు.

మాదాపూర్‌లోని సిద్ధిక్‌ నగర్‌లోని విజయ్‌ ఇంటిని పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజీల ద్వారా ఇప్పటికే నిందితులను గుర్తించిన పోలీసులు హంతకుల కోసం గాలింపు చేపట్టారు. విజయ్‌కుమార్‌ వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఆదివారం ఉదయమే ఈ కేసులో పోలీసులు అసలు నిందితులను గుర్తించారు. బైక్‌ నెంబర్‌ ఆధారంగా తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులు చివరకు కేసును ఓ కొలిక్కితీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement