గంజాయి రవాణా గుట్టురట్టు.. | Police Seized Marijuana In Suryapet | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణా గుట్టురట్టు..

Jun 26 2020 11:17 AM | Updated on Jun 26 2020 11:44 AM

Police Seized Marijuana In Suryapet - Sakshi

సూర్యాపేట: బొలెరో వాహనం ప్రమాదానికి గురి కావడంతో అక్రమ మార్గంలో జరుగుతున్న గంజాయి రవాణా గుట్టు రట్టయ్యింది. కట్టంగూర్‌ మండలం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కురుమర్తి క్రాస్‌ రోడ్డు వద్ద హైదరాబాద్‌ వైపు వెళ్తున్న బొలెరో వాహనం యూటర్న్‌ తీసుకుని రాంగ్ ‌రూట్‌లో కట్టంగూర్‌ వైపు వస్తుండగా చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్‌ సహా మరో వ్యక్తికి గాయాలు కాగా, సమీపంలోని పంట పొలాల్లో ఉన్న రైతులు వారిని బయటకు తీశారు. కొద్దిసేపటికి  గాయాలతో ఉన్న ఇద్దరు పరారీ అయ్యారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. బొలెరో వాహనంలో సుమారు 50 గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లుగా  గుర్తించారు. గంజాయి ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement