యమహాపై వచ్చి.. శవాన్ని పడేసి | Police get vital clue in Kondapur murder case | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసులో నిందితుల గుర్తింపు

Feb 11 2018 11:33 AM | Updated on Aug 21 2018 6:02 PM

Police get vital clue in Kondapur murder case - Sakshi

బైక్‌పై వెళ్తున్న నిందితులు

సాక్షి, హైదరాబాద్‌ : కొండాపూర్ బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పలు కీలక ఆధారాలతో పాటు మృతురాలి వివరాలను సేకరించారు. ఈ హత్య కేసులో కీలక నిందితులను సీసీటీవీ పుటేజీ ద్వారా గుర్తించారు. మృతదేహాన్ని ఏపీ 10 ఏఎల్‌ 9947 నంబర్‌ ఉన్న యమహా బైక్‌పై తీసుకువచ్చి బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో పడేసి వెళ్లిపోయినట్లు నిర్ధారించారు. బైక్‌ ఎవరిదని విచారించగా బౌద్దనగర్‌లోని ఆనంద్‌ కుటీర్‌కు చెందిన గర్డే విజయ్‌కుమార్‌కు చెందినదిగా గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.

గచ్చిబౌలి పోలీసులు మృతురాలు మహారాష్ట్ర వాసిగా గుర్తించారు. కొండాపూర్‌తో పాటు నగరంలో నివాసం ఉంటున్న మహారాష్ట్ర, అస్సాం వాసులను పోలీసులు విచారిస్తున్నారు. పదిరోజుల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  క్రితం మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనె సంచిలో పెట్టి బొటానికల్‌ గార్డెన్‌ వద్ద పడేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement