టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు

Police case filed against chandragiri TDP MLA condidate Pulivarthi Nani - Sakshi

సాక్షి, తిరుపతి : చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు అయింది. పాకాల మండలంలోని పులివర్తివారిపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి బావమరిది కేశవులు రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పులివర్తి నానిపై పాకాల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.  కాగా గతంలోనూ  పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి... గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుతగిలారు. ఆయనకు అండగా నిలిచిన దళితులపై దాడులకు తెగబడ్డారు. అవ్వా తాతలనీ లాగిపడేశారు. అడ్డొచ్చిన పోలీసులపైనా చిందులేశారు. బతుకు తెరువు కోసం కొనుగోలు చేసిన ఆటోనూ ధ్వంసం చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ హెచ్చరికలు జారీచేశారు. వైఎస్సార్‌సీపీకి ఓటేస్తే మీ అంతుచూస్తామంటూ దళితులను గదమాయించారు. ఓటర్లను గృహనిర్బంధం చేస్తూ అలజడి సృష్టించారు.

రీ పోలింగ్‌ సరళి పరిశీలించిన సీఈవో
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో ఆదివారం కేంద్ర ఎన్నికల పరిశీలకుడు వినోద్‌ జుక్షి  భేటీ అయ్యారు. ద్వివేది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో జరుగుతున్న రీపోలింగ్‌ సరళిని వివరించారు. అలాగే ఈ నెల 23న కౌంటింగ్‌ ఏర్పాట్లుపై చర్చించారు. సోమవారం మధ్యాహ్నం అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఆర్వోలతో కౌంటింగ్‌ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top