
సాక్షి, హైదరాబాద్: నగరంలో సోమవారం తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆరుగురు మహిళలపై దాడికి యత్నించాడు. ఈ ఘటన పాతబస్తీలోని కాలాపత్తర్‌లో జరిగింది. మహ్మద్ యాసిన్ అనే యువకుడు కారులో వెళ్తున్న ఆరుగురు మహిళలపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. పారిపోతున్న నిందితున్ని కారు డ్రైవర్ స్థానికుల సాయంతో పట్టుకున్నాడు. దేహశుద్ధి చేసిన స్థానికులు యాసిన్‌ను పోలీసులకు అప్పగించారు. స్ప్రే కారణంగా అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.