గాంధీ ఆస్పత్రి నర్సుపై దాడి | Patient Relatives Attacks Gandhi Hospital Nurse | Sakshi
Sakshi News home page

గాంధీ ఆస్పత్రి నర్సుపై దాడి

Sep 29 2017 3:06 PM | Updated on Sep 29 2017 3:08 PM

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో నర్సుపై  ఓ గర్భిణీ బంధువులు దాడిచేసిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నాగారంనకు చెందిన ఆసియాబేగంను ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆ వార్డులో రద్దీ ఎక్కువ కావడంతో ఒకే మంచాన్ని ఇద్దరు రోగులకు కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన ఆమె బంధువులు అక్కడ డ్యూటీలో ఉన్న నర్సుపై అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో దాడి చేశారు. 

తెల్లవారాక తనపై జరిగిన దాడిపై ఆ నర్సు అధికారులకు ఫిర్యాదు చేసింది. దాడికి నిరసనగా నర్సులందరూ విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నర్సుపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ నర్సులకు హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement