
ఆపద సమయంలో, విధి నిర్వహణలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారే అసలైన హీరోలు. ఒక పసిబిడ్డను కాపాడేందుకు షీరోనర్స్ చేసిన సాహసం, ధైర్యం విశేషంగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మీ ధైర్యానికి సెల్యూట్! అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు.
టిక్కర్ గ్రామానికి చెందిన స్టాఫ్ నర్సు కమల అనారోగ్యంతో ఉన్న పసిపాపకు ఇంజెక్షన్ ఇచ్చేందుకు హురాంగ్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇటీవలి భారీ వర్షాల కారణంగా విస్తృతంగా విధ్వంసం సంభవించింది. సిల్బుధాని , తార్స్వాన్ పంచాయతీలలో రోడ్లు , ఫుట్‌బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామానికి వెళ్లే మార్గం కష్టంగా మారింది. పద్దర్ సబ్ డివిజన్ పరిధిలోని చౌహార్ లోయ మండిలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఒకటి. అటు చూస్తే కాలువ పొంగిపొర్లుతోంది నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది ఏ మాత్రం స్లిప్ అయినా ప్రాణాలకే ముప్పు. అయినా సరే వృత్తి ధర్మం నెరవేర్చాలనే ఆశయంతో రాళ్లపై ఒక్క ఉదుటున దూకి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ కాలువ దాటింది.
Meet Staff Nurse Kamla, who risked her life to ensure a two-month-old baby received a crucial injection. With the bridge in her area swept away, she crossed the river to reach the child. She is From Paddhar's Chauharghati, Mandi. @CMOFFICEHP @mansukhmandviya @nhmhimachalp @WHO pic.twitter.com/o9JFmIHskx
— Vinod Katwal (@Katwal_Vinod) August 23, 2025
> అద్భుత సాహసానికి సంబంధించిన ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని సుధార్ పంచాయతీలోని చౌహర్‌ఘాటిలో చోటు చేసుకుంది. నర్సు ధైర్యానికి అందరూ ముగ్ధులయ్యారు. అదే సమయంలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫ్రంట్‌లైన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమాదాలపై ఆందోళన కూడా వ్యక్తమైంది.
ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!