వ్యభిచార గృహంపై దాడి | Panjagutta Police Raid on Prostitution House | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై దాడి

Aug 22 2019 11:05 AM | Updated on Aug 22 2019 2:15 PM

Panjagutta Police Raid on Prostitution House - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీతి నిలయం అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో వ్యభిచారం

సాక్షి, హైదరాబాద్‌: వ్యభిచారంపై పంజాగుట్ట పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు యువతులు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడలోని శ్రీతి నిలయం అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో వ్యభిచారం జరుగుతుందని  సమాచారం అందడంతో ఎస్సై మహ్మద్‌ జాహిద్‌  ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగయ్య, ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వాహకులు భానుప్రకాష్, పవన్‌లతో పాటు నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు కుమార్‌ పరారీలో ఉన్నట్లు  తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకులను రిమాండ్‌ తరలించి, యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement