ప్రేమిస్తున్నాను.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి

Palghar Police Arrested A Man Has Trafficked Over 500 Girls From Bangladesh - Sakshi

ముంబై : ఉద్యోగాల పేరుతో.. ప్రేమ పేరుతో దాదాపు 500 మంది అమ్మాయిలను, మైనర్‌ యువతులను బంగ్లాదేశ్‌ నుంచి ముంబైకి అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని, అతని ఏజేంట్లను పాల్ఘార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివారాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్‌ సైదుల్‌ షేఖ్‌(38) 2010 నుంచి థానే జిల్లా దొంబివాలి మన్‌పడాలో నివాసం ఉంటున్నాడు. ఇండియాలో నివాసం ఉంటున్న షేఖ్‌ తన ఏజెంట్ల ద్వారా బంగ్లాదేశ్‌కు చెందిన యువతలను అక్రమంగా ఇక్కడికి తీసుకువచ్చి వారిని అసాంఘీక కార్యకలపాలకు పాల్పడే వ్యక్తులకు అమ్మేవాడు. ఈ క్రమంలో షేఖ్‌ ఏజెంట్లు సదరు యువతులను ప్రేమ పేరుతో.. ఉద్యోగాల పేరుతో మాయ మాటాలు చెప్పి ముంబై తీసుకు వచ్చేవారు.

ఇలా తీసుకువచ్చిన అమ్మాయిలను షేఖ్‌కు అప్పగించేవారు. వీరిని షేఖ్‌ ఒక్కోక్కరిని లక్ష రూపాయలకు సదరు ముఠాలకు విక్రయించేవాడు. ఈ అక్రమ రవాణా దందా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ ఈ విషయం గత ఏడాది పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో పోలీసులు సంవత్సరం నుంచి షేఖ్‌ను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో షేఖ్‌ అనుచరుడు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలిసులు షేఖ్‌తో పాటు మరో ఏడుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరందరి మీద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే షేఖ్‌ మీద పలు కేసులు నమోదయ్యాయని.. ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top