
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఆరెంజ్ ట్రావెల్స్‌కు..
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్‌కు మాత్రం గాయాలు అయ్యాయి. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో తెనాలి నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.