వృద్ధుడి దారుణ హత్య   | Old Man killed | Sakshi
Sakshi News home page

వృద్ధుడి దారుణ హత్య  

Jun 21 2018 2:35 PM | Updated on Jun 21 2018 2:35 PM

Old Man killed - Sakshi

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, (ఇన్‌సెట్‌లో) మాధవరావు(ఫైల్‌) 

ఆత్మకూర్‌(ఎస్‌)(సూర్యాపేట) : ఆత్మకూర్‌ఎస్‌ మండలం బొప్పారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఎడ్ల మాధవయ్య(60) అనే వృద్ధు డు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి ఆరుబ యట నిద్రిస్తున్న  వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు పదునైన గొడ్డలితో తలపై నరకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

వివరాలు..మాధవయ్య మనుమడు(కుమార్తె కొడుకు) పెళ్లి ఈ నెల 24న కోదాడ మండలంలోని కొమరబండలో జరగనుంది. మాధవయ్య భార్య భాగ్య మ్మ పెళ్లి పనుల నిమిత్తం మూడు రోజుల క్రితం కుమార్తె ఇంటికి(కొమరబండ) వెళ్లింది. లారీక్లీనర్‌గా పనిచేస్తున్న మాధవయ్య చిన్నకుమారుడు వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి ఇంటికి చేరుకోగా తండ్రి, కొడుకు మద్యం సేవించారు.

రాత్రి 10 గంటల అనంతరం మాధవయ్య ఇంటి ముందు నిద్రకు ఉపక్రమించగా.. వెంకటేశ్వర్లు  స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి మద్యం సేవించాడు. అనంతరం వచ్చి తండ్రి మంచానికి కొద్ది దూరంలో మరో మంచం వేసుకుని నిద్రపోయాడు. తెల్లవా రుజామున లేచిన వెంకటేశ్వర్లు తండ్రిని లేపడానికి వెళ్లగా రక్తపు మడుగులో ఉండడంతో నిర్ఘాంతపోయి, పక్క ఇంట్లో వేరుకాపురం ఉంటున్న తన అన్న జలంధర్‌ను నిద్రలేపి విషయం తెలిపాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హత్యపై అనుమానాలు

మాధవరావు హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతబడి అనుమానంతోనే హత్య జరిగినట్టు స్థానికులు అంటుండగా, వివాహేతర సంబంధం, భూతగాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్టు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ హరిక్రిష్ణ పరిశీలించారు. హత్యకు వాడిని గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ నుంచి క్లూస్‌ టీంను, డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించి వివరాలను సేకరించారు.

పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని సూ ర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ హరిక్రిష్ణ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement