వృద్ధుడు ఆత్మహత్య | Old Man Committed Suicide | Sakshi
Sakshi News home page

వృద్ధుడు ఆత్మహత్య

May 1 2018 9:16 AM | Updated on Aug 17 2018 2:56 PM

Old Man Committed Suicide - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కుభీర్‌(ముథోల్‌) : మండలంలోని చాత గ్రామానికి చెందిన ఆకుల పోశెట్టి(72) అనే వృద్దుడు కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రమేశ్‌ తెలి పారు. పోశెట్టి కడుపునొప్పితో చాలా ఆసుపత్రులు తిరిగి నయం కాకపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి చేనులోకి బయలుదేరి అక్కడే పురుగుల మందు సేవించాడు.

చేనులో చు ట్టుపక్కల వారు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. మృతుడి కొడుకు భోజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement