గుట్టల్లో యువతి శవం లభ్యం | Nursing Girl Died With Suspicious Medak | Sakshi
Sakshi News home page

గుట్టల్లో యువతి శవం లభ్యం

Feb 9 2019 11:38 AM | Updated on Feb 9 2019 11:38 AM

Nursing Girl Died With Suspicious Medak - Sakshi

 రోదిస్తున్న బంధువులు,  కల్పన (ఫైల్‌)

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని గుబ్బడి గ్రామపంచాయితీ పరిధిలోని కవాడి గుట్టల్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. కేశనాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధిలోని చౌడుతండాకు చెందిన లావుడ్య కల్పన(21)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లావుడ్య ముత్యాలు–గంగు దంపతుల పెద్ద అమ్మాయి కల్పన. వారికి నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుర్లకు వివాహం చేశాడు. ఉద్యోగం వచ్చిన తర్వాతే వివాహం చేసుకుంటా అని  కల్పన జీఎన్‌ఎం చేసుకుంటూ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోనే హన్మకొండలో నర్సుగా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

గత నెల 30న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంనేందుకు స్వగామానికి వచ్చిందని మరుసటి రోజున తిరిగి హన్మకొండకు వెళ్తున్న చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కల్పన అనుమానాస్పందగా మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం హాస్టల్‌ నుంచి కల్పన రాలేదని సమాచారం రావడంతో తల్లిదండ్రులు కల్పన ఆచూకి కోసం గాలిపు చర్యలు మొదలు పెట్టిన్నట్లు గిరిజనులు చెబుతున్నారు. కాగా కవాడి గుట్టల్లో గొర్రెల కాపరి యువతి శవాన్ని గుర్తించినట్లు తెలపడంతో తండావాసులు అక్కడి చేరుకొని మృతదేహం కల్పనగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని హుస్నాబాద్‌ ఏసీపీ సందేపోగుల మహేందర్, సీఐ శ్రీనివాస్‌లు పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసినట్లు ఎస్సై పాపయ్యనాయక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement