పట్టాలు తప్పిన రైలు.. ఆరుగురి మృతి

Nine Bogies Of Jogbani Anand Vihar Terminal Seemanchal Express Derailed In Bihar - Sakshi

పట్నా: బీహార్‌లోని హాజీపూర్‌ వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం వేకువజామున 3.52 గంటల సమయంలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని కేంద్రం మంత్రి పీయూష్‌ గోయల్‌ అధికారులను ఆదేశించారు. అజ్మీర్‌నుంచి జైపూర్‌ జంక్షన్‌ వైపు వెళ్తుండగా ఇంజన్‌ పట్టాలు తప్పి బోల్తా పడిందని సంగనేర్‌ పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల సహాయార్థం రైల్వే శాఖ హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు.. సోన్సూర్ - 06158 221645, హజీపూర్ - 06224 272230, బరౌని- 06279 232222.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top