పెళ్లయిన రెండో రోజే.. | Newly Married Woman Dies Of Heart Attack In Srikakulam District | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో వధువు మృతి 

Dec 1 2019 9:28 AM | Updated on Dec 1 2019 10:01 AM

Newly Married Woman Dies Of Heart Attack In Srikakulam District - Sakshi

కాశీబుగ్గ: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు గుండెపోటుతో మృతి చెందింది. పలాస మండలం గరుడఖండి గ్రామంలో పెళ్లయిన రెండో రోజునే నవవధువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సిగిలిపల్లి వరలక్ష్మి కుమార్తె దమయంతికి తురలకకోటకు చెంది న గోపీనాథ్‌ అలియాస్‌ సురేష్‌కు ఇచ్చి ఈ నెల 28వ తేదీ గురువారం రాత్రి నందిగాం మండలం సుబ్బమ్మపేట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వివాహం జరిపించారు. శనివారం ఉదయం ఐదు గంటలకు దమయంతికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే సమయంలోనే మృతి చెందింది. కాళ్ల పారాణి ఆరకుండానే దమయంతికి నూరేళ్లు నిండిపోవడంతో కన్నవారు, అత్తింటి వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన ఈ పరిసర ప్రాంతాల్లో సంచలనంగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement