ఘోర ప్రమాదం.. గోడ కూలి 16 మంది మృతి

Nearly 16 Members Died In Pune Due To Wall Collapse - Sakshi

పుణె: మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున గోడ కూలిన ఘటనలో దాదాపు 16 మంది మృతి చెందారు. నగరంలోని కొంద్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మృతుల్లో 9 మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top