
న్యూఢిల్లీ: ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్ గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) రట్టు చేసింది. ఢిల్లీ వర్సిటీ విద్యార్థులు ఇద్దరు, జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీకి చెందిన ఒకరు, అమిటీ వర్సిటీకి చెందిన ఒక విద్యార్థి అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి 1.14 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. కొత్త ఏడాది సందర్భంగా వర్సిటీలక్యాంపస్ పార్టీలో వీటిని వాడాలని నిందితులు ప్లాన్‌వేశారు.