నేను చచ్చిపోతున్నా... | nagaraju sucide in gulf | Sakshi
Sakshi News home page

నేను చచ్చిపోతున్నా...

Feb 9 2018 2:18 AM | Updated on Aug 21 2018 3:08 PM

nagaraju sucide in gulf  - Sakshi

సారంగాపూర్‌(జగిత్యాల): ‘అమ్మ కు డబ్బులు పంపలేకపోతున్నాను. మా అమ్మను, నాన్నను, తమ్ముణ్ణి బాగా చూసుకోండ్రి’ అం టూ మిత్రులకు వాట్సాప్‌ మేసేజ్‌ పంపి గల్ఫ్‌లోని దోహా ఖతార్‌లో జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సారంగాపూర్‌ మం డలం పెంబట్లకు చెందిన తోట నాగరాజు (24) స్వగ్రామం మంచిర్యాల జిల్లా బాదంపల్లి.

నాగరాజు దోహ ఖతార్‌కు ఐదేళ్లుగా వెళ్లి వస్తున్నాడు.  నాగరాజుకు పెళ్లి చేయాలని  తల్లిదండ్రులు శంకర్, కళావతి సంబంధం కూడా చూసి పెట్టారు. అక్కడ వాహనాల క్లీనిం గ్‌ పనులు చేసే నాగరాజుకు కం పెనీ నెలకు 500 దిర్హమ్స్‌ (రూ.8779) చెల్లించాలి. కానీ, మిషన్లు చెడిపోయాయంటూ నెల కు 100 దిర్హమ్స్‌(రూ.1756)  ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారం రాత్రి తాను పనిచేసే చోటే ఉరేసుకొని ఆత్మ హత్య చేసు కున్నాడు. అంతకు ముందు  మిత్రులకు వాట్సాప్‌ వాయిస్‌ ద్వారా తన ఆత్మహత్యకు గల కారణాలను పంపాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement