చెరువు ఒడ్డున తల్లీకూతుళ్ల శవాలు | Mother With Two Minor Daughters Assassinated In UP | Sakshi
Sakshi News home page

యూపీలో ముగ్గురి దారుణ హత్య

May 27 2020 1:22 PM | Updated on May 27 2020 1:32 PM

Mother With Two Minor Daughters Assassinated In UP - Sakshi

సరోజిని, ఆమె ఇద్దరు కూతుళ్లు శివానీ, రోషిణిలను...

లక్నో : తల్లితో పాటు ఇద్దరు మైనర్‌ కూతుళ్లను చంపి ఎండిపోయిన చెరువు ఒడ్డున పడేశారు దుండగులు. ఈ సంఘటన మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుభన్‌ ఖేదా తిక్రా గ్రామానికి చెందిన సరోజిని, ఆమె ఇద్దరు కూతుళ్లు శివానీ, రోషిణిలను గొంతు నులిమి హత్య చేసి అక్కడి ఓ ఎండిపోయిన చెరువు ఒడ్డున పారేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మూడు శవాలను పోస్టుమార్టమ్‌ నిమిత‍్తం తరలించారు. సరోజిని భర్త అనంతును, అతడి సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రాధమిక ఆధారాల ప్రకారం మృతురాలి భర్త, అతడి తమ్ముడే ఈ హత్యలకు పాల్పడిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ( భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని..)

చదవండి : ‘ఊపిరాడటం లేదు: అమ్మా! అమ్మా!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement