ఏ తల్లి కన్నబిడ్డో... ఎందుకు వదిలేసిందో | Mother Leaves Her Infant In Chanda nagar | Sakshi
Sakshi News home page

ఏ తల్లి కన్నబిడ్డో... ఎందుకు వదిలేసిందో

Nov 27 2019 8:23 AM | Updated on Nov 27 2019 8:23 AM

Mother Leaves Her Infant In Chanda nagar - Sakshi

సాక్షి, చందానగర్‌ : ఏ తల్లి కన్నదో...ఎందుకు వదిలేసిందో తెలియదు...పుట్టిన కొద్ది గంటల్లోనే ఓ పసికందును రోడ్డుపై వదిలేశారు. స్థానికులు ఆ పసికందును చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్లితే.. చందానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్‌ గృహా కల్ప బ్లాక్‌ నెం. 26,27 మధ్య రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్న ఒక మగ శిశువును వదిలేశారు. మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చలికాలం కావడంతో ఆ బాలుడు గుక్క పెట్టి ఏడవంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం స్థానికులను విచారించారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం కొండాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌లో బాలుడ్ని అప్పగించినట్టు సీఐ రవీందర్‌ తెలిపారు.   

∙  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement