కన్న పేగే కాటేసింది | Mother Killed Daughter in Tamil Nadu | Sakshi
Sakshi News home page

కన్న పేగే కాటేసింది

Sep 30 2019 7:57 AM | Updated on Sep 30 2019 7:57 AM

Mother Killed Daughter in Tamil Nadu - Sakshi

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..

చెన్నై,తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే ప్రియుడితో కలిసి హత్య చేసిందో కసాయి తల్లి. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని సేవూర్‌కు చెందిన కుమార్‌ కూలి. భార్య సోలయమ్మాల్‌. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈనెల 15న సోలయమ్మాల్‌ ఆరణి ప్రభు త్వఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటిరోజే బిడ్డతో సహా అదృశ్యమైంది. సేవూర్‌ వీఏఓ కార్యాలయానికి ఆదివారం ఉదయం తన వివాహేతర ప్రియుడు బాబు (49)తో కలిసి వచ్చింది. తనకు పుట్టిన ఆడబిడ్డను తామిద్దరం హత్య చేసి పాతి పెట్టామని తెలిపింది. వీఏఓ ఆరణి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement