చేతులెలా వచ్చాయమ్మా? | Mother And Son Commits Suicide in Bengaluru | Sakshi
Sakshi News home page

చేతులెలా వచ్చాయమ్మా?

Jun 3 2019 12:35 PM | Updated on Jun 3 2019 12:35 PM

Mother And Son Commits Suicide in Bengaluru - Sakshi

తల్లి కుమారుడి మృతదేహాలు

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు గీతాబాయి, ఆమె కొడుకు వరుణ్‌. చీటీల్లో నష్టాలు వచ్చాయని ఆమె కన్నకొడుకుని ఉరివేసి చంపి, తరువాత తానూ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘోరం బెంగళూరులో చోటుచేసుకుంది.

బనశంకరి: చీటీ వ్యవహారాల్లో తీవ్ర నష్టాలు రావడంతో మనస్థాపం చెందిన మహిళ తన 12 ఏళ్లు కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘటన శనివారం రాత్రి హెచ్‌ఏఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.... విభూతిపుర ఎస్‌ఎల్‌ఎన్‌ స్కూల్‌ వద్ద సురేశ్‌బాబు, గీతాభాయి (45) దంపతులు నివాసముంటున్నారు. వీరికి వరుణ్‌ (12) అనే కుమారుడు ఉన్నారు. సురేశ్‌బాబు ట్రావెల్స్‌ ఏజెన్సీ నిర్వహిస్తుండగా గీతాబాయి ఇంటి వద్ద కిరాణాదుకాణం నిర్వహించడంతో పాటు  చీటీల నడిపేది. ఇటీవల చీటీల లావాదేవీలలో నష్టాలు రావడంతో చీటీలు వేసిన వ్యక్తులు డబ్బుకోసం గీతాబాయిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమె శనివారం అర్ధరాత్రి భర్త విధులకు వెళ్లిన సమయంలో కుమారుడుని ఫ్యాన్‌కు ఉరి వేసి అనంతరం మరో గదిలో తాను కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న సురేశ్‌ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హెచ్‌ఏఎల్‌ పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని  మృతదేహాలకు శవపరీక్షల నిమిత్తం బౌరింగ్‌ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement