బాలుడిపై లైంగికదాడి.. పదేళ్ల జైలు | Molestation on Boy Ten Years Prison Punishment For Rowdy Sheeter | Sakshi
Sakshi News home page

బాలుడిపై లైంగికదాడి.. పదేళ్ల జైలు

Jun 25 2020 12:13 PM | Updated on Jun 25 2020 12:13 PM

Molestation on Boy Ten Years Prison Punishment For Rowdy Sheeter - Sakshi

మహ్మద్‌ మునీరుద్దీన్‌

బహదూర్‌పురా: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన ఓ రౌడీషీటర్‌కు న్యాయస్థానం పదేళ్లజైలు శిక్షవిధించింది. బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌ తెలిపిన మేరకు.. బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్‌ మహ్మద్‌ మునీరుద్దీన్‌ (36) 2015లో బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న  పోలీసులు నిందితున్ని అరెస్ట్‌ చేసి కోర్టులో చార్జీషీట్‌ వేసి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా అడిషనల్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ జడ్జి నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4 వేల జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement