
బ్యాగును వెదుకుతున్న రైల్వే పోలీసులు
తిరుపతి క్రైం : గణపతి నగరం ఎమ్మెల్యే గన్‌మెన్ బ్యాగు తిరుపతి రైల్వే స్టేషన్‌లో బుధవారం చోరీకి గురైంది. ఈస్ట్ పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా గణపతి నగరం ఎమ్మెల్యే అప్పలనాయుడు గన్‌మెన్ శంకరరావు బందోబస్తు నిమిత్తం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.
బ్యాగును రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఉంచి వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తి దాన్ని చోరీ చేశాడు. దీంతో గన్‌మెన్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో గన్, 20 రౌండ్ల బుల్లెట్లు, 20 రౌండ్ల మ్యాగ్జిన్, డబ్బులు ఉన్నట్టు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు సీఐ చంద్రబాబునాయుడు స్పెషల్ టీమ్‌తో తనిఖీ లు చేపట్టారు. ఈ క్రమంలో ఏడుకొండల బస్టాండులో బ్యాగు లభ్యమైంది. అందులో అన్నీ ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.