హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడు వదిలేసి వెళ్లిన బ్యాగు కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం అరైవల్ ర్యాంప్ 10 నంబర్ పిల్లర్ వద్ద బూడిద రంగులో ఉన్న బ్యాగు కనిపించడంతో అప్రమత్తమైన భద్రతాధికారులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది బ్యాగ్‌ను పరిశీలించారు. అందులో ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు లేవని నిర్ధారించుకున్నారు. బ్యాగులో కొన్ని మొబైల్ ఫోన్లతో పాటు విదేశీ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.12.72 లక్షల వరకు ఉండవచ్చునని అంచనా వేశారు. అనంతరం బ్యాగ్‌ను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. బ్యాగు తీసుకొచ్చిన వారి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.


