రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి పీఏ మృతి 

MLA Baji reddy PA Died in road accident - Sakshi

దైవదర్శనం తర్వాత  అనంతలోకాలకు.. 

బంధువుల ఇంటికి   వెళ్తుండగా..

సిద్దిపేట జిల్లా   ప్రజ్ఞాపూర్‌ వద్ద ఘటన

డిచ్‌పల్లి: నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ వద్ద పీఏగా పని చేస్తున్న చంద్రకంటి బాలగంగాధర్‌(61), ఆయన సతీమణి విజయ(55) గురువారం సిద్దిపేట్‌ జిల్లా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న బాలగంగాధర్‌ దంపతులు తమ కారులో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌కు బయలు దేరారు.

ప్రజ్ఞాపూర్‌లో బంధువుల ఇంట్లో రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే యాదగిరి గుట్టలో జరిగే శుభకార్యానికి పోవాలని వారు నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో ప్రజ్ఞాపూర్‌ శివారులోకి చేరుకోగానే రాజీవ్‌ రహదారిపై ఆగి ఉన్న లారీ కిందకు వీరు ప్రయాణిస్తున్న కారు చొచ్చుకుపోయింది. దీంతో కారు నడుపుతున్న బాలగంగాధర్, ఆయన సతీమణి విజయ అక్కడికక్కడే మృతి చెందారు.

మరో కిలోమీటరు ప్రయాణిస్తే వారు బంధువుల ఇంటికి చేరుకునేలో పే రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. ధ ర్పల్లి మండల కేంద్రానికి చెందిన బాలగంగాధర్‌ 1998లో ఆర్టీసీ కండక్టర్‌ ఉద్యోగంలో చే రారు. అనంతరం ఇరిగేషన్‌ విభాగంలో పని చేశారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వద్ద పీఏగా సుధీర్ఘ కాలం పని చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జుక్కల్‌ ఎమ్మె ల్యే గంగారాం వద్ద పీఏగా పని చేశారు.

2014 నుంచి రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ వద్ద పీఏగా పని చేస్తున్నా రు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధు లు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు అం దరితో కలుపుగోలుగా ఉండే బాలగంగాధర్‌ మృతి చెందడంపై రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాలగంగాధర్‌కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.    
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top