నాలుగేళ్ల తర్వాత టెక్నాలజీతో ఆచూకీ..

Missing Girl Traced By Telangana Police Use Facial Recognition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు, అధునాతన టెక్నాలజీతో పలు కీలక కేసులను చాకచాక్యంగా పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా.. ఇటీవలే ఫెషియల్‌ రికగ్నైజేషన్‌ టూల్‌ సహాయంతో తప్పిపోయిన వారిని సొంతవారి చెంతకు చేరుస్తున్న తెలంగాణ పోలీసులు మరో కేసును విజయవంతంగా చేధించారు. తాజాగా మతిస్థిమితం లేని ఓ బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

2014లో మతిస్థిమితం లేని ఓ బాలిక ఇంట్లో నుంచి తప్పిపోయింది. ఆ తర్వాత గార్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. అప్పటి నుంచి ఆమెను ఘట్‌కేసర్‌లోని చైల్డ్‌ హోమ్‌లో ఉంచారు. తాజాగా ఫెషియల్‌ రికగ్నైజేషన్‌ సాంకేతికతో ఆ బాలిక వివరాలు సేకరించే ప్రయత్నం చేసిన పోలీసులు అందులో విజయం సాధించారు. ఆ బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని మహిళా భద్రత విభాగం చీఫ్‌ స్వాతి లక్రా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top