ఇంటికి చేరుకున్న దాసరి ప్రభు!

Missing Dasari Taraka Prabhu Reachs Home Safely - Sakshi

బంజారాహిల్స్‌: దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) ఆచూకీ అభ్యమైంది. గత కొన్ని రోజులుగా అదృశ్యమైనట్టు భావిస్తున్న ఆయన బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. గతవారం దాసరి ప్రభు అదృశ్యమైనట్టు ఆయన మామ జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటికి చేరుకున్న దాసరి ప్రభును పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎందుకు అదృశ్యమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? అన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. 
(చదవండి: మిస్టరీగానే దాసరి ప్రభు అదృశ్యం)

నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన దాసరి ప్రభు తిరిగి రాలేదని, అప్పటినుంచి ఆయన కనిపించడం లేదని, ఎంత వెతికినా ఆయన జాడ తెలియడం లేదని కుటుంబసభ్యులు గతవారం పోలీసులను ఆశ్రయించారు. 2008లోనూ ప్రభు ఇలా అదృశ్యమయ్యారు. అప్పట్లో తిరిగి వచ్చిన ప్రభు తన భార్య సుశీల తనను కిడ్నాప్‌ చేసిందంటూ ఆరోపించారు. దాసరి మరణం తరువాత కుటుంబంలో నెలకొన్న వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దాసరి ప్రభు మరోసారి అదృశ్యం కావటంతో కుటుంబ కలహాలే కారణమని భావించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top