దారుణం : మరిగే నూనెలో చేతులు పెట్టించి! | Minor Girl Hand In Hot Oil Over Suspected Affair | Sakshi
Sakshi News home page

దారుణం : మరిగే నూనెలో చేతులు పెట్టించి!

May 25 2018 1:14 PM | Updated on Aug 17 2018 5:11 PM

Minor Girl Hand In Hot Oil Over Suspected Affair - Sakshi

పోలీసుల అదుపులో రాహుల్‌, బాధిత యువతి

అహ్మదాబాద్‌ : భర్త మీద అనుమానంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. పక్కింటి అమ్మాయితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ మహిళ మరిగే నూనెలో వారిద్దరి చేతులు పెట్టించింది. ఈ భయానకమైన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాహుల్‌ పర్మార్‌, సుమన అనే దంపతులు రాజ్‌కోట్‌లోని భగవతిపారా ప్రాంతంలో నివశిస్తున్నారు. అయితే సుమనకు తమ పక్కిట్లో ఉండే ఓ యువతి(17)తో రాహుల్‌ వివాహేతర సంబంధం నడుపుతున్నారనే అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదని నిరూపించుకోవడానికి బాగా మరుగుతున్న నూనెలో చేతులు పెట్టాలని కోరింది. దీనికి అంగీకరించని యువతి, తన భర్తతో బలవంతంగా సలసల కాగే నూనెలో  చేతులు పెట్టించింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దంపతులిద్దరినీ అరెస్టు చేసి పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. రాహుల్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ సదరు యువతి పోలీసులకు తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement