రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య | Minor girl abducted, sexually assaulted, and murdered in Pune | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

Oct 23 2017 5:43 AM | Updated on Jul 30 2018 8:37 PM

Minor girl abducted, sexually assaulted, and murdered in Pune  - Sakshi

పుణే: ఇంట్లో నిద్రపోతున్న ఓ రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారంచేసి హత్యచేసిన దారుణం పుణేలో జరిగింది. శనివారం రాత్రి కిడ్నాపైన బాలిక ఆదివారం ఇంటి దగ్గర్లోని హౌసింగ్‌ సొసైటీ ప్రాంతంలో శవమై కన్పించింది. పుణేలోని సింహగఢ్‌లో సదరు బాలిక దినసరి కూలీలైన తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. శనివారం రాత్రి తల్లితో కలిసి నిద్రపోతున్న చిన్నారిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.

చిన్నారి కన్పించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆదివారం ఇక్కడి హౌసింగ్‌ సొసైటీ దగ్గర ఓ బాలిక మృతదేహం ఉందని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు మృతదేహం కిడ్నాపైన బాలికదేనని నిర్ధారించారు. దుండగులు బాలికను రేప్‌ చేశాక గొంతునులిమి హత్య చేశారని ఏసీపీ శివాజీ మీడియాతో చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement