ప్రాణం తీసిన మూఢనమ్మకం | Married Woman Deceased With Snake Bite in Rangareddy | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మూఢనమ్మకం

Jul 9 2020 9:17 AM | Updated on Jul 9 2020 9:17 AM

Married Woman Deceased With Snake Bite in Rangareddy - Sakshi

భాగ్య (ఫైల్‌)

దౌల్తాబాద్‌: మూఢనమ్మకానికి ఓ నిండు ప్రాణం బలైన సంఘటన మండలంలోని నీటూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. నీటూరు గ్రామానికి చెందిన సిలింపురం రమేష్, భాగ్య భార్యభర్తలు. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. మంగళవారం రాత్రి ఎప్పటి మాదిరిగా ఇంట్లో నిద్రిస్తున్నారు. రాత్రి 11గంటలకు భాగ్య(22)కు నిద్రలో చేతికి ఏదో కరిచినట్లయింది. లేచి చూసేసరికి పాము కనిపించింది. వెంటనే వారు ఆటోలో ఓ మంత్రగాడి దగ్గరికి బుల్కపూర్‌కు వెళ్లారు. నయం అవుతుందని మంత్రగాడు చెప్పడంతో ఇంటికి వచ్చేశారు. ఉదయం మళ్లీ శరీరంలో మార్పులు రావడంతో చికిత్స నిమిత్తం తాండూరు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వికారాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement