వివాహిత ఆత్మహత్య | married woman committed suicide in gara | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jan 31 2018 8:18 PM | Updated on Jan 31 2018 8:18 PM

married woman committed suicide in gara - Sakshi

పుక్కళ్ల ధనం మృతదేహం

గార : కొర్లాం పంచాయతీ కొమురవానిపేటలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ గ్రామానికి చెందిన పుక్కళ్ల్ల ధనం(26) అనే వివాహిత సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తనచీరనే కట్టుకుని ఉరివేసుకుంది. భర్త దత్తాత్రేయ సీమెన్‌గా పనిచేస్తూ రెండు నెలల కిందట విధులు ముగించుకొని సెలవులపై ఇంటికి వచ్చాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు నిఖిల్‌(4), లోకేష్‌(8నెలలు) ఉన్నారు. తల్లి మృతితో ఇద్దరు చిన్నారుల రోదన మిన్నంటింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఒడిశా రాష్ట్రం జబల్‌పూర్‌ గ్రామానికి చెందిన మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మంగళవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించారు. భర్త వేధింపులు భరించలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లి గురమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బలివాడ గణేష్‌ కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement