వరంగల్ జిల్లా: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రిసోల్ గ్రామానికి చెందిన గుప్తేశ్వర్ బిష్యాన్‌కు అతడి మేనకోడలు మిల్లీ బిస్వాస్(21)తో ఈ ఏడాది జూన్ 14న పూరి జగన్నాథ దేవాలయంలో వివాహం జరిగింది. వివాహ అనంతరం ఆ దంపతులు వరంగల్‌కు వచ్చి గీసుకొండ మండలం ధర్మారం గ్రామంలో కిరాయికి ఉంటున్నారు.
ఈక్రమంలో గుప్తేశ్వర్ అనుమానంతో తరచూ భర్యను వేధింపులకు గురి చేసేవాడు. దీనిపై ఈ నెల 8న మిల్లీ తన తల్లికి ఫోన్ చేసి తనను భర్త వేధిస్తున్నాడని, తనకు భార్య అవసరం లేదని, ఇంటి నుంచి వెళ్లిపోయవాలని లేదా చనిపోవాలని అంటున్నాడని ఏడుస్తూ చెప్పింది. దీంతో కుటుంబీకులు ధర్మారం చేరుకుని పరిశీలించగా భర్త వేధింపులతో మిల్లీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు గుప్తేశ్వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.
ఇదీ చదవండి: కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం


