వివాహితపై ఇద్దరు యువకుల గ్యాంగ్‌రేప్‌ | Married Raped By Two Youths | Sakshi
Sakshi News home page

వివాహితపై ఇద్దరు యువకుల గ్యాంగ్‌రేప్‌

May 9 2018 12:25 PM | Updated on Oct 16 2018 4:50 PM

Married Raped By Two Youths - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొణిజర్ల : మతిస్థిమితం లేని ఓ వివాహితపై ఇద్దరు యువకులు గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన సంఘటన తనికెళ్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొణిజర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తనికెళ్లకు చెందిన ఓ వివాహిత (25)కు చిన్నప్పటి నుంచి మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈమెకు ఆరు సంవత్సరాల క్రింతం వివాహం కాగా..నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త ఏడాది క్రితం వదిలేశాడు.

మార్చి 9వ తేదీన ఈమె తన పెద్దమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా వారి వీధిలోనే ఉండే బంటు యల్లారావు అనే యువకుడు ‘మీ అమ్మఫోన్‌ చేసింది. ఇదిగో ’..అంటూ ఇంటిలొకి పిలిచి, నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతని స్నేహితుడు మేకల రామకృష్ణ కూడా ఆమెను అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపుతామని బెదిరించడంతో ఆమె భయపడి ఎవరకీ చెప్పలేదు.

తిరిగి గత నెల (ఏప్రిల్‌) 17న సదరు వివాహిత మెడికల్‌ దుకాణానికి వెళ్లి వస్తుండగా తనికెళ్ల సెంటర్‌లో యల్లారావు ఆమెను లారీ కింద తోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె అదృష్టవశాత్తూ బయట పడటంతో తలకు గాయమైంది. అతడే  చికిత్స చేయించి ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. భయంభయంగా ఉంటుండటంతో..తల్లి ఆమెను గట్టిగా అడగడంతో సదరు యువకులు తనపై అఘాయిత్యానికి ఒడిగట్టిన విషయాన్ని తెలిపింది.

దీంతో..తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైరా ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్‌ ఆదేశాల మేరకు సదరు యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు యువకులు పరారీలో ఉన్నారు.     

Advertisement
 
Advertisement
Advertisement