దివ్యాంగ బాలుడి కేసులో... ఇండిగోకు రూ.5 లక్షల ఫైన్‌

IndiGo fined Rs 5 lakh by DGCA for not allowing disabled child to board - Sakshi

న్యూఢ్లిల్లీ: మానసిక వైకల్యమున్న బాలుడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మీద డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) సీరియస్‌ అయింది. విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ శనివారం రూ.5 లక్షల జరిమానా విధించింది.

ఈ నెల 7న రాంచీ విమానాశ్రయంలో తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్‌ విమానం ఎక్కబోతుండగా సదరు బాలున్ని సిబ్బంది అడ్డుకోవడం, అది వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఎవరి మాటా వినకుండా ఉన్మాదంగా ప్రవర్తించాడన్న ఇండిగో వాదనను డీజీసీఏ తోసిపుచ్చింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top