మానసిక వ్యాధులకు ఆరోగ్యశ్రీ

Aarogya Sri Scheme for mental diseases Andhra Pradesh - Sakshi

కడప రిమ్స్‌లో రూ.50 కోట్లతో మానసిక వ్యాధుల ఆస్పత్రి 

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా 

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): గతంలో ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే మానసిక వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా చెప్పారు. విజయవాడలో డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి నిర్వహిస్తున్న ఇండ్లాస్‌ విమ్‌హాన్స్‌ మానసిక వైద్యశాలను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

రాయలసీమ ప్రాంత వాసులు మానసిక వ్యాధులకు చికిత్స పొందేందుకు ఇప్పటి వరకు ఆస్పత్రి అందుబాటులో లేదన్నారు. దీంతో కడప రిమ్స్‌లో రూ.50 కోట్లతో 100  పడకల మానసిక వ్యాధుల ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందన్నారు.

తమ జిల్లాకు చెందిన డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్‌ విశాల్‌రెడ్డి నాలుగు దశాబ్దాల కిందటే విజయవాడలో మొదటి మానసిక వ్యాధుల ఆస్పత్రి స్థాపించి, ఈ ప్రాంతం వారికి సమర్థమైన సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి  తాను రచించిన ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రికి అందచేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top