పోలీసులు విచారణకు వెళ్తే.. | Man Trying to Endlives in Hyderabad | Sakshi
Sakshi News home page

పోలీసులు విచారణకు వెళ్తే..

Mar 31 2020 11:06 AM | Updated on Mar 31 2020 11:06 AM

Man Trying to Endlives in Hyderabad - Sakshi

అబిడ్స్‌: ఆత్మహత్యా చేసుకోవాడానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన షాహినాత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చుడిబజార్‌లో  చోటు చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం... చుడిబజార్‌లో నివాసం ఉండే పాపాలాల్‌కు స్థానికంగా ఉండే బస్తీవాసులకు కొన్నిరోజులుగా గొడవులు జరుగుతున్నాయి. 15రోజుల క్రితం ఓ మహిళలపై పాపాలాల్‌ దాడి చేశాడు. అనంతరం ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాపాలాల్‌పై 4–సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అదే విధంగా వారం రోజుల క్రితం మరో మహిళ పాపాలాల్‌పై ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. దీంతో ఈ రెండు కేసుల్లో పాపాలాల్‌ను విచారించేందుకు ఈనెల 28వ తేదీన షాహినాత్‌గంజ్‌ పోలీసులు పాపాలాల్‌ ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసి పాపాలాల్‌ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పాపాలాల్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా పాపాలాల్‌పై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 12 కేసులు నమోదైనట్లు ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌పాషా తెలిపారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement